ఈ నెల 18న మేడారంకు సీఎం కేసీఆర్

ఈ నెల 18న మేడారంకు సీఎం కేసీఆర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈనెల 18న సీఎం కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లనున్నారు. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మకు కేసీఆర్ బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. మేడారం జాతర నేటి నుంచి 19 వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతరకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఫిబ్రవరి 20న సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఫిబ్రవరి 21న నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఫిబ్రవరి 23న మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.