నెక్కొండలో వార్ వన్ సైడ్

నెక్కొండలో వార్ వన్ సైడ్

వన్ సైడ్ లీడింగ్ ఓటింగ్ దిశగా నెక్కొండ
కారు గుర్తు నినాదాలతో దద్దరిల్లిన నెక్కొండ
జనసంద్రంగా మారిన నెక్కొండ టౌన్
మంచి చేశాడు తప్పక మళ్లీ గెలిపిస్తాడు
పెద్ది సుదర్శన్ రెడ్డికి భారీ మెజార్టీ ఇస్తామంటున్న ప్రజలు

నెక్కొండలో వార్ వన్ సైడ్వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఛాలెంజ్ విసురుతున్నా, నెక్కొండకు నాకంటే ఎక్కువ నిధులు తెచ్చిన వారున్నారా, దమ్ముంటే చర్చకు రండి అని నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి సవాలు విసిరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నెక్కొండ ప్రజలు పెద్దికి బోనాలు, బతుకమ్మలతో ఎదురొచ్చి కోలాటాలు ఆడుతూ బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ నినాదాలతో నెక్కొండను హోరెత్తించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఒక్క నెక్కొండ టౌన్ కే రెండున్నర కోట్ల సీసీ రోడ్లు ఇచ్చాను. నెక్కొండను “మున్సిపల్” గా మార్చే దిశగా అడుగులు పడుతున్నై.మీ దీవెనలు మెండుగా ఉంటే కచ్చితంగా చేసి తీరుతా అని అన్నారు.కరోనా కష్ట కాలంలో అండగా ఉన్న, వడగండ్ల వానకు చెక్కులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.అపోజిషన్కు ఛాలెంజ్ విసురుతున్న నాకంటే ఘనమైన పని ఒక్కటి చేసినా చెప్పండి.

రైతును అన్ని విధాలా ఆదుకుని, రెండు పంటల సంస్కృతికి నాంది పలికిన ఘనత బీఆర్ఎస్ పార్టీది.రైతు బందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఫిర్యాదిచ్చి ఆపిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి నెక్కొండకు అన్ని విధాలా అత్యంత ప్రాధాన్యత నిచ్చానన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రోడ్ వైడింగ్ చేసి, సుందరంగా తీర్చిదిద్దబడ్డ సెంట్రల్ డివైడర్ & లైటింగ్.సుదీర్ఘకాలపు కల “రైల్వే అండర్ బ్రిడ్జి” చేయించి పట్టణ ప్రజల గోస తీర్చానన్నారు.
నిండు మనస్సుతో దీవించండి.కష్టించి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచే బాధ్యత నాది.

నా గెలుపుకు అత్యంత కృషి చేసిన ప్రతీ కార్యకర్తను కడుపుల పెట్టి చూస్కుంటా.గౌరవ కెసీఆర్ చలవతో, వారితో సుదీర్ఘకాలం పనిచేసిన చనువుతో నర్సంపేటకు నిధుల వరద సాగింది.గెలిచిన ఒక్క టర్మ్ లోనే అభివృద్ధిలో నియోజకవర్గ రూపు రేఖలు మారినై, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే ఒక్కసారి ఊహించండి ఏ విధంగా వృద్ది చెందుతుందో చూడండి అన్నారు.చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగునీటి ప్రాజెక్టులతో పాటు,నర్సంపేటను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి,మెడికల్ కాలేజ్,పెద్దాసుపత్రి తెచ్చిన మీ బిడ్డను,కారు గుర్తును భారీ మెజారిటీతో గెలిపించండి,తరతరాలు చెప్పుకునే విధంగా అభివృద్ది చేస్తానని పెద్ది సుదర్శన్ రెడ్డి నెక్కొడ ప్రజలను కోరారు.