నన్నపునేనికి మద్దతుగా ఎల్బీనగర్
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఓట్ల కోసం, సీట్ల కోసం వచ్చే ఈ దద్దమ్మలను నమ్మకండి అని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఉద్దెశించి మాట్లాడారు వరంగల్ తూర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ 21వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ ఫుర్ఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చి గంపగుత్తగా కారుకు ఓటేస్తామంటూ నినదించారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడానికి కారణమే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో చీకట్లు అలుముకొని రైతులు కోసపడేది వ్యాపారవేత్తలు ధర్నాలు చేసేది.
అట్లాంటి దౌర్భాగ్య పరిపాలన అందించింది కాంగ్రెస్. సాగునీరు త్రాగునీరు కోసం మన తెలంగాణ రైతన్నలు ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని స్కాములే, ప్రజల ప్రగతిని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రైతన్నలకు మూడు గంటల కరెంటు ఇస్తానన్న కాంగ్రెస్ కావాలా 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా మీరే ఆలోచించాలి. 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు ఇయ్యాలనే సోయి ఎందుకు లేదు. 24 గంటల కరెంటు రైతు బీమా సాగునీరు త్రాగునీరు కెసిఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారు. నాడు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ లాగా పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల అభ్యున్నతికి ఏమాత్రం సహకరించని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోయిన ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సురేఖ ఈ ప్రాంతానికి తట్టేడు మట్టి కూడా పోయలేదు.
అభివృద్ధికి సహకరించని ఈ కాంగ్రెస్ మహానటి ఐదేళ్లకోసారి ఓట్ల కోసం మన వద్దకు వస్తుంది. ఇక్కడి ప్రజలను వద్దని పరకాల పోయి పరకాల అవ్వగారిల్లని వరంగల్ తూర్పు అత్తగారిల్లని ప్రస్తావించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వచ్చి తప్పు చేశానని మన ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడింది. అట్లాంటి వ్యక్తి నేడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వస్తుంది. ప్రజలందరూ నిలదీయండి. ఆజాంజాయి మిల్లు అమ్ముకుంటుంటే ఈ కాంగ్రెస్ పాలకులు గుడ్డి గుర్రాల పళ్ళు తోమరా కార్మికులను రోడ్డున పడేసి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నారు.
కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు ఫామ్ హౌస్ లో, మరోకరు పౌల్ట్రీ లో ఉన్నారు.నేను ప్రజలకు సేవ చేస్తూ కరోనాలో 25 వేల మందికి నిత్యవసర సరుకులు పంచాను వరదలు వస్తే ప్రజల వెంట ఉన్న పండుగలు వస్తే ప్రజలు వెంట ఉన్న కానీ ఇప్పుడు వచ్చే దొంగ నాయకులు కోసం మాత్రమే వస్తారు ఆలోచించండి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విద్యా వైద్యం బాగుండాలని ఏడు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది వైద్యంలో భాగంగా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది.
అభివృద్ధిలో భాగంగా నూతన బస్ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కలెక్టరేట్ వాడవాడనా రోడ్లు ఇలా ఓరుగల్లును కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశా 11 సార్లు కాంగ్రెస్ కు ఆకాశం ఇస్తే మండి బజార్ చౌరస్తా రోడ్లు వేయడం కూడా చేతకాలేదు. ఎప్పుడో 65 ఏళ్ల కిందట వేసిన రోడ్లు తదనంతరం నేను ఎమ్మెల్యే అయ్యాక రోడ్లు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశాను. ఈ డివిజన్లో ప్రజలు బస్తీ దవాఖాన కావాలని కోరారు ఎన్నికల అనంతరం బస్తీ దావకాన ఏర్పాటు కృషి చేస్తా. ఇంకా రోడ్లు మోరిల కోసం ప్రజలు పాకులాడుతున్నారంటే కాంగ్రెస్ ఎంత గొప్పగా పరిపాలించిందో అర్థమవుతుంది.
నియోజకవర్గంలో పేద ప్రజలు బాగుండాలని 22వందల డబల్ బెడ్ రూమ్ నిర్మించడం జరిగింది. ఎన్నికల అనంతరం ప్రజలకు పంచుతాం 3000 గృహలక్ష్మి దళిత బందు బీసీ బందు మైనారిటీ బందు ఎన్నికల అనంతరం ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ డివిజన్ నుండి గృహలక్ష్మి కోసం వచ్చిన 120 అప్లికేషన్లకు సాంక్షన్ ఇవ్వడం జరిగింది. పేద ప్రజల అభ్యున్నతే ద్యేయంగా నేను పనిచేస్తున్నాను. కాంగ్రెస్ ను నమ్మి కోసపడకండి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా కుంటుపడిపోతుంది. మళ్లీ పాత రోజులు వస్తాయి కాంగ్రెసును బొంద పెడితేనే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. నవంబర్ 30న నాలుగవ నంబర్ నన్నపునేని నరేందర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ ఫుర్ఖాన్ తోపాటు డిప్యూటీ మేయర్ రిజ్వాన సమీర్ మసూద్, ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా, సరోగసి బోర్డు మెంబర్ హరి రమాదేవి, డివిజన్ అధ్యక్షులు జూపాక అనిల్,యాకుబ్ పాషా,బిఆర్ఎస్ నాయకులు తోట హరీష్,అజాం,ముష్క ప్రమీల,కవిత,లీలావతి,గొల్లన రవి,సమ్మక్క,సరితా,సౌమ్య ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు.