పోలీసులుండగానే బైరి నరేష్ కి దేహశుద్ధి

పోలీసులుండగానే బైరి నరేష్ కి దేహశుద్ధి

పోలీసులుండగానే బైరి నరేష్ కి దేహశుద్ధివరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ :హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి మరీ దేహశుద్ధి చేశారు. గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ జైలుకెళ్లిన విషయం తెలిసిందే.జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేశాడు నరేష్.

అయితే తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించిన అయ్యప్ప భక్తులు బైరి నరేష్ పై దాడి చేశారు. పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ పోలీసులనే పక్కకు తోసేసి పోలీస్ వాహనంలోనే నరేష్ పై పిడిగుద్దులతో దాడి చేశారు.చివరకు పోలీసులు నరేష్ పై దాడి చేసిన వారిని లాగి పక్కకు తోసేసారు.