తుపాకీతో కాల్చుకుని డాక్టర్ సూసైడ్ 

తుపాకీతో కాల్చుకుని డాక్టర్ సూసైడ్

తుపాకీతో కాల్చుకుని డాక్టర్ సూసైడ్ వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం నెలకొంది. డాక్టర్ మాజారుద్దీన్ అనే వ్యక్తి ఈ ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు అప్రమత్తమై ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజారుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. మాజారుద్దీన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.