మెడిసిన్ లో రెండో విడుత నోటిఫికేషన్

మెడిసిన్ లో రెండో విడుత నోటిఫికేషన్వరంగల్ అర్బన్ జిల్లా : ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు రెండో విడుత నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు.

మొదటి విడుత కౌన్సిలింగ్ లో సీటు పొంది చేరని అభ్యర్థులు , ఆల్ ఇండియా కోటాలో సీటు పొంది చేరని అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులని తెలిపారు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.