కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ ను వీడనున్నారా?

కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ ను వీడనున్నారా?హైదరాబాద్ : ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ జట్టును వీడుతున్నట్లు వచ్చిన పుకార్లను ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కొట్టిపారేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఐపీఎల్ లో మరో జట్టుకు మారనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా విలియమ్సన్ ఐపీఎల్ లో ఇంకో జట్టులోకి వెళ్తున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఓ నెటిజన్ వార్నర్ ను ట్విటర్లో కోరాడు. ఈ విషయాన్ని నేను ఇప్పుడే వింటున్నా . కేన్ ఎక్కడికీ వెళ్లడు అంటూ వార్నర్ సమాధానమిచ్చాడు.

ఐపీఎల్-2020 లో వార్నర్, కేన్ నిలకడగా రాణించారు. హైదరాబాద్ టీం 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది.