హనుమకొండలో ముగిసిన బ్యాట్మింటన్ క్రీడలు

హనుమకొండలో ముగిసిన బ్యాట్మింటన్ క్రీడలు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన కాకతీయ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ 2022 పోటీలు ఆదివారం ఘనంగా ముగిసాయి. వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన ఫైనల్స్ లో 35 వయస్సు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ కి చెందిన పవన్ , ఖాదర్ మస్తాన్ జంట ఫైనల్స్ లో విజయం సాధించింది. రన్నప్ గా వరంగల్ ఆఫీసర్ క్లబ్ క్రీడాకారులు రజనీకాంత్, ఆర్.ఐ సతీష్ నిలిచారు. 45 వయస్సు విభాగం సీఆర్ పీఎఫ్ కు చెందిన సంతోష్ కుమార్, కే.జీ కామ్ లు వరంగల్ ఆఫీసర్ క్లబ్ క్రీడాకారులు షఫీ గోపాల్ పై ఫైనల్స్ లో విజయం సాధించారు. హనుమకొండలో ముగిసిన బ్యాట్మింటన్ క్రీడలు50 వయస్సు విభాగంలో ఖమ్మంకు చెందిన టి.కె.సూరి, జె.శ్రీను సీఆర్పీఎఫ్ క్రీడాకారులు సంతోష్, జగ్జీత్ సింగ్ లపై విజయం సాధించారు. 55 వయస్సు విభాగంలో అశోక్ కుమార్ రెడ్డి, సుబ్రమణ్యంలు జి.వి.రావ్, రాంమోహన్ లపై విజయం సాధించారు. ఈ ముగింపు క్రీడలకు అంతర్జాతీయ బ్యాట్మింటన్ క్రీడాకారుడు అల్లూరి శ్రీ సాయి, సిరిల్, వర్మతో పాటు మరో అంతర్జాతీయ బ్యాట్మింటన్ క్రీడాకారిణి మనీషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ముగింపు కార్యక్రమములో ముఖ్య అతిథులు మరియు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి చేతుల మీదుగా విన్నర్స్, రన్నరప్ మరియు మూడు, నాలుగు స్థానాల్లో విజేతలుగా నిలిచిన బ్యాట్మింటన్ క్రీడాకారులకు ట్రోఫీలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు.

ఎంతో ఉత్సహంగా పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందనలు తెలిపారు. ప్రతీ ఒక్క క్రీడాకారుడు తమ వయస్సును మరిచి పోటీల్లో పోటీపడటం చాలా సంతోషంగా వుందన్నారు. వయస్సు పైబడి వున్న ఈ బ్యాట్మింటన్ క్రీడల్లో యువత తో సమానంగా పోటీ పడ్డారని సీపీ అన్నారు. క్రీడల ద్వారా మనసుకు స్వాంతన చేకురడంతో పాటు ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు. వయస్సు మళ్ళినవారు, రోజులో కొద్ది సమయం క్రీడలు ఆడేందుకు కేటాయించాలని సీపీ సూచించారు. ముఖ్యంగా ఈ క్రీడలను విజయవంతం చేయడంలో కీలకంగా నిలిచిన హన్మకొండ ఎసీపీ జితేందర్ రెడ్దితో పాటు క్రీడల నిర్వహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు.

అలాగే ఈక్రీడల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులందరికి సీపీ తరుణ్ జోషి అభినందనలు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమములో జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్ది, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, ట్రైనీ ఐపీఎస్ లు పంకజ్, సంకీర్త్, ఆఫీసర్ క్లబ్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ ప్రతినిధి డా. రమేష్, వాగ్దేవి విద్యా సంస్థల కరస్పాండెంట్ సత్యపాల్ రెడ్దితో పాటు క్రీడాకారులు, క్లబ్ సభ్యులు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.