హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా ఫ్రీగా పబ్లిసిటీ అయ్యేవిధంగా చూసుకుంటారు. ఏ సినిమా తీసినా దాన్ని జనం, యూత్‌లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఆయన మియా మాల్కోవా ప్రధాన పాత్రలో క్లైమాక్స్ సినిమా తీశారు. దానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానిపై బిన్నాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలసిందే. అయితే ఆయన ఇప్పుడు న్యాక్‌డ్ (నగ్నం) అనే ఇంకో సినిమాను తీశారు. దీన్ని శనివారం రాత్రి 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇది 22 నిమిషాల నిడివి కలిగి ఉంటుందని, వెబ్‌సైట్‌లో ఈ సినిమా చూడొచ్చని ఆయన తన ట్వీట్‌లో తెలియజేశారు. దీన్ని చూడటానికి 200 వసూలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు సినిమా పోస్టర్‌ను కూడా జత చేశారు. ఈ సినిమాను ఆయన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.