రాజకీయాలకు గుడ్‌బై : సోనియా గాంధీ
వరంగల్ టైమ్స్, ఛత్తీస్ గఢ్ : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటించిన ఆమె భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అని ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషం కలిగించిందన్నారు. పేదల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు.