ముంబైలో ప్రారంభం కానున్న స్కూళ్లు

ముంబైలో ప్రారంభం కానున్న స్కూళ్లుముంబయి : మహారాష్ట్రలో స్కూళ్లను వచ్చే సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ముంబయి మహానగరంలోనూ స్కూళ్లను సోమవారం నుంచి తెరనున్నట్లు మంత్రి వర్షా గైక్వాడ్ వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జనవరి 24 నుంచి స్కూళ్లను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. తమ ప్రతిపాదనకు సీఎం అంగీకరించినట్లు మంత్రి చెప్పారు.

మొదట కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గుతోందని, అందుకే నిపుణుల సూచన మేరకు స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. స్కూళ్ల ప్రారంభంపై స్థానిక అధికారులకే అవకాశం ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. మున్సిపల్ కమీషనర్లు, జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, విద్యాధికారులు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.