పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్

పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్అమరావతి : ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉద్యోగులకు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని కృష్ణయ్య తన పిటిషన్ లో పేర్కొన్నారు. సెక్షన్ 78 ( 1) కి విరుద్ధంగా ఉన్న జీవో 1 ని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కృష్ణయ్య కోరారు. ఈ సందర్భంగా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది.