సుమోటోగా వీధి కుక్కల దాడి కేసు

సుమోటోగా వీధి కుక్కల దాడి కేసు

సుమోటోగా వీధి కుక్కల దాడి కేసువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలుడిపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

ఈ ఘటనపై తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. బాలుని మృతి బాధాకరమని హైకోర్టు తెల్పింది. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మీ నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది.

ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ ,హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు పంపించింది. బాలుడు మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు , తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది. అయితే దీనిపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.