జటాయువు ఫారెస్ట్ పార్కులో దారుణం
-ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం
-జింక పిల్లపై విధి కుక్కల దాడి
-దాడిలో గాయపడిన జింక మృతి
వరంగల్ టైమ్స్, మేడ్చల్ జిల్లా : పీఎంసీ పరిధిలోని జటాయువు ఫారెస్ట్ లో దారుణం చోటు చేసుకుంది. జటాయువు పార్కులో సంచరిస్తున్న ఓ జింక పిల్లపై వీధి కుక్కల దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జింక మృతి చెందింది. అసలు వీధి కుక్కలు జటాయువు ఫారెస్ట్ లోకి ప్రవేశించడంపై ఫారెస్ట్ అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాయిప్రియా కాలనీ కొన్ని సంవత్సరాలుగా ప్రహరి నిర్మాణ మరమ్మత్తులు చెపట్టకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కుందేళ్ళ వేటగాళ్ళు ఆ మార్గం ద్వారా జటాయువులోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. గతంలో కూడ వేటగాళ్ళు అక్కడ వేసిన వలలను తొలగించి ఆ విషయాన్ని వాకర్స్ తొలగించి ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది. ఇప్పుడు జింక పిల్లను వీధి కుక్కలు దాడి చేసి చంపడం పట్ల వాకర్స్, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.