శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు 

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు వరంగల్ టైమ్స్, మెదక్ జిల్లా : ఛత్రపతి శివాజీ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సమస్యలపై పోరాటం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఛత్రపతి యువసేన ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణకు మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఛత్రపతి యువసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఆహ్వానం పలికారు. తర్వాత ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కులమతాలకు అతీతంగా శివాజీ అందరినీ ఆదరించేవాడని, ఒక క్రమశిక్షణతో పలు రాజ్యాలను జయించి ఆదర్శంగా నిలిచారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన శివాజీ పరాక్రమాన్ని అందిపుచ్చుకుని యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి, ఛత్రపతి శివాజీ నివాళులర్పించారు.