నరసరావుపేటలో ప్రారంభానికి నూతన కలెక్టరేట్
వరంగల్ టైమ్స్, పల్నాడు జిల్లా : నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ బంగ్లా చివరి దశ పనులను పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ బంగ్లాకు రెండు వైపులా ఉన్న మురుగు కాలువలను మరింత మెరుగుపరిచి, వాటిపై పగడ్బందీగా మూతలు ఏర్పాటు చేయాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రవీంద్రను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ రిపేర్లకు గురై వినియోగంలో లేకపోవడంతో వెంటనే మరమ్మతులు చేయడం లేదా కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ డిఇ ఏడు కొండలు కు జిల్లా కలెక్టర్ సూచించారు. బంగ్లాలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.త్వరిత గతిన కలెక్టర్ బంగ్లాను పూర్తిచేసి, అనువుగా సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రహదారులు మరియు భవనాల శాఖ ఈ రాజా నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.