ఈ నెల 28న పీజీ ఈసెట్ నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : 2023-2024 విద్యాసంవత్సరానికి గాను ఎంటెక్, ఎం ఫార్మసీ , ఆర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీ ఈసెట్) నోటిఫికేషన్ షెడ్యూట్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మార్చి 3 నుండి ఆన్టైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.250 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే10 వరకు, రూ. 2500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ. 5000 ఆలస్య రుసుముతో మే మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులకు మే 2 నుంచి 4 వరకు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు. మే 21 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయని టీఎస్ పీజీ ఈ సెట్ కన్వీనర్ తెలిపారు.