గండ్రకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ? 

గండ్రకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ?

గండ్రకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ? వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ కోసం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చారికి ఎమ్మెల్సీ వచ్చినంక ఆయన చాలా దూకుడు పెంచారు. చారి వర్గం స్పీడు మీదుంది. ఎందుకంటే ఇక్కడ గులాబీ పార్టీ చాలా జోరు మీద ఉంది. సింగరేణి బెల్ట్ లోనూ గులాబీ జెండాదే హవా. కాబట్టి బీఆర్ఎస్ టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు లాంఛనమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే అటు గండ్ర, ఇటు చారి నేనంటే నేనంటూ గులాబీ టికెట్ కోసం సై అంటున్నారు.

*నాడు ఢీ అంటే ఢీ, నేడు అంతా కూల్
ఇటీవల భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించిన సమయంలోనూ గండ్ర, చారి వర్గాలు దాదాపు కొట్టుకున్నంత పనిచేశాయి. ఈ రెండు వర్గాల ఓవరాక్షన్ చూసి ఎమ్మెల్సీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. అది మరువకముందే భూపాలపల్లికి కేటీఆర్ విచ్చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతానుభవాల దృష్ట్యా ఈసారి ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీ చారి వర్గాలు సంయమనం పాటించాయనే చెప్పాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా కేటీఆర్ టూర్ సాగింది. అయితే ఈ టూర్ తో భూపాలపల్లి బీఆర్ఎస్ టికెట్ పై ఓ క్లారిటీ వచ్చిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.గండ్రకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ? 

* సర్వే రిపోర్ట్ ఫలించినట్లేనా !
కేటీఆర్ భూపాలపల్లి టూర్ కు రాక ముందే ఆయన టీమ్ నియోజకవర్గానికి వచ్చిందట. ఓ సర్వే కూడా చేసిందని టాక్. ఎమ్మెల్యే గండ్ర పనితీరుపై కేటీఆర్ టీమ్ సభ్యులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారట. అన్నీ పక్కాగా లెక్కలేసుకుని ఓ రిపోర్టును కూడా తయారు చేసినట్లు టాక్. మంత్రి కేటీఆర్ భూపాలపల్లికి రాగానే ఆ రిపోర్టును ఆయనకు అందించినట్లు సమాచారం. భూపాలపల్లి పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ కూడా అన్నీ జాగ్రత్తగా గమనించారట. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు, సింగరేణి ఏరియాలో పార్టీ పరిస్థితేంటి ? అన్న దానిపై ఆరా తీసినట్లు సమాచారం. ఇవన్నీ బేరీజు వేసుకుని కేటీఆర్ ఓ అభిప్రాయానికి వచ్చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

*గండ్ర అనుచరులంతా ఫుల్ ఖుషీ
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం భూపాలపల్లి బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ గండ్ర దంపతులపై ప్రశంసల వర్షం కురిపించారు. సందర్భోచితంగా గండ్ర పనితీరును మెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో తనకు గండ్ర ధైర్యం చెప్పారంటూ గతాన్ని గుర్తుచేశారు. అంతేకాదు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులివ్వడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి బహిరంగసభలో కేటీఆర్ ప్రసంగం విన్న తర్వాత గండ్ర అనుచరులంతా ఫుల్ ఖుషీగా ఉన్నట్లు టాక్. గండ్రకు పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేసినట్లేనని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.గండ్రకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ? * టికెట్ గురించి గండ్రకు స్పష్టత ఇచ్చినట్లేనా !
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. భూపాలపల్లి బహిరంగసభలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి గురించి గండ్ర 2,3 సార్లు ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే చారితో తనకు ఎలాంటి వైరం లేదన్న సంకేతాలను ఇవ్వడానికి గండ్ర ప్రయత్నించారని టాక్. ఇది కేటీఆర్ కూడా గ్రహించినట్లు గులాబీ శ్రేణులు చెబుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేటీఆర్ ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టికెట్ గురించి గండ్రకు స్పష్టత ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

* తన వర్గాన్ని కంట్రోల్ చేస్తున్న చారి..
గండ్రకు సానుకూల సంకేతాలొచ్చాయన్న వార్తలతో ఎమ్మెల్సీ చారి వర్గం అయితే నిరాశలో ఉన్నట్లు సమాచారం. అయితే చారి మాత్రం తన వర్గాన్ని కంట్రోల్ లో ఉండాలని ఆదేశించారట. కేసీఆర్ పిలిచి మరీ తనకు ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారట. అందుకే తొందరపడి కేసీఆర్ దగ్గర తన పేరు చెడగొట్టవద్దని తన అనుచరులకు స్పష్టం చేసినట్లు టాక్. అంతమాత్రాన ఆయన టికెట్ పై ఆశలు వదిలేసుకున్నారని చెప్పలేమంటున్నారు గులాబీ శ్రేణులు.

*హైకమాండ్ చూపు గండ్ర వైపా..చారి వైపా !
అయితే చివరి నిమిషం వరకు టికెట్ కోసం చారి పోరాడే అవకాశం కనిపిస్తోంది. కానీ భూపాలపల్లి గులాబీశ్రేణుల అభిప్రాయం ప్రకారం చూస్తే గండ్రకు బీఆర్ఎస్ టికెట్ దాదాపు లాంఛనమేనని తెలుస్తోంది. మరి నిజంగానే భూపాలపల్లి బీఆర్ఎస్ టికెట్ గండ్ర సొంతమవుతుందా? లేక లాబీయింగ్ తో గులాబీ టికెట్ ను చారి దక్కించుకుంటారా? ఇద్దరిలో హైకమాండ్ ఎవరిని కరుణిస్తుందో చూడాలి.