బెజవాడలో దారుణం..తెలంగాణ ఫ్యామిలీ సూసైడ్

బెజవాడలో దారుణం..తెలంగాణ ఫ్యామిలీ సూసైడ్నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ కు చెందిన ఓ వ్యాపారి కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పప్పుల సురేష్, భార్య శ్రీలత, ఇద్దరు కొడుకులు అఖిల్, ఆశిష్ తో కలిసి గంగస్థాన్ -ఫేజ్-2లోని శ్రీచైతన్య అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఖలీల్ వాడిలోని ఓ నర్సింగ్ హోంకు అనుబంధంగా మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు.

పిల్లలిద్దరూ ఉన్నత చదువులు చదివారు. పెద్ద కుమారుడికి ఈ యేడాది పెళ్లి కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈక్రమంలో అప్పుల భారంతో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో ఇతర కుటుంబ సభ్యులు, బంధులు కన్నీరుమున్నీరవుతున్నారు.సురేష్ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్స్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆ కుటుంబం సూసైడ్ నోట్ లో వెల్లడించింది.

ఆత్మహత్యకు ముందు కుటుంబసభ్యులు సూసైడ్ నోట్ రాశారు. ఇబ్బందులు పెట్టినవారి వివరాలను అందులో పేర్కొన్నారు. నోట్ తో పాటు తమను వేధించిన వారి వివరాలను సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను పప్పుల సురేష్ తమ బంధువులకు పంపించారు. ఫైనాన్స్ వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో తెలిపారు.