హైదరాబాద్ చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

హైదరాబాద్ చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

హైదరాబాద్ చేరుకున్న 'ఆర్ఆర్ఆర్' టీంవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆస్కార్ వేడుకల అనంతరం రాజమౌళి, కీరవాణి దంపతులు , కార్తికేయ, సింహా, కాలభైరవలు హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వీళ్లకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆర్ఆర్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ, ఆస్కార్ గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ టీంతో మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా, రాజమౌళి జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇటీవలే హైదరాబాద్ కు వచ్చిన తారక్ కు జై ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరోవైపు రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో ఢిల్లీలో లాండ్ అయ్యాడు. శుక్రవారం ఉదయం ఇండియా టుడే కాన్ క్లేవ్ లో అతిథిగా పాల్గొననున్నాడు.