ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కథేంటి ?

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కథేంటి ?

ఆస్కార్ గెలిచిన 'ది ఎలిఫెంట్ విస్పర్స్' కథేంటి ?వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో ఈ సారి రెండు అవార్డులు మన భారత దేశానికి దక్కడం గర్వకారణం. 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రాగా, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ ఈ అవార్డు అందుకుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ డాక్యుమెంటరీ దేని గురించి, దీనికి ఆస్కార్ రావడానికి గల కారణమేంటి, ఈ డాక్యుమెంటరీ ఎన్ని నిమిషాలు ఉంటుంది, దీన్ని ఎక్కడ చిత్రీకరించారు, డాక్యుమెంటరీలో ముఖ్య పాత్ర ఎవరిది అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం..

హిస్టరీ క్రియేట్ చేసిన డాక్యుమెంటరీ
‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కు గునిత్ మొంగా నిర్మాత. ఆమెకు ఇది రెండవ ఆస్కార్ అవార్డు. గతంలో కూడా మరో డాక్యుమెంటరీ ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీకి ఆమెకు ఆస్కార్ లభించింది. ఇప్పుడు తాజాగా మరోసారి ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ షార్ట్ ఫిల్మ్ కు ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించారు. అయితే ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ 2022, డిసెంబర్ 8న విడుదలైంది. ఈ చిత్రం మొదట నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యింది. నలుగురు నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. డగ్లస్ బ్లష్, కార్తికీ గోన్సాల్వేస్, గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మేకింగ్ కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ డాక్యుమెంటరీని రూపొందించడానికి కార్తికి గోన్సాల్వేస్, కట్టునాయకన్ తెగకు చెందిన ఏనుగు కుటుంబంతో ఐదేండ్లు గడిపారు.ఆస్కార్ గెలిచిన 'ది ఎలిఫెంట్ విస్పర్స్' కథేంటి ?‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కథ ఇలా సాగింది..
ఈ షార్ట్ ఫిల్మ్ కథ విషయానికి వస్తే తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ లో అడవి నుంచి తప్పించుకున్న రఘు, అము అనే రెండు ఏనుగు పిల్లలను అక్కడికి దగ్గరలోని గ్రామంలో ఉన్న ఓ వృద్ద జంట బొమ్మన్ అండ్ బెయిలీ దత్తత తీసుకుని పెంచుకుంటారు. ఈ దంపతులిద్దరూ స్వదేశీయులు. బొమ్మన్, బెయిలీలు రఘును జాగ్రత్తగా చూసుకుంటారు. దీని కారణంగా ఈ జంటకు రఘు ఏనుగు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. భారతీయ కుటుంబానికి ఒంటరి ఏనుగుకు మధ్య గల బంధాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ క్రమంలో అక్కడి ప్రకృతితో వీరి బంధం, అనుబంధం మరింత పెరుగుతుంది. ఏనుగులు అలాగే, ఇతర జంతువులతో మానవుల సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం సహాయపడుతుంది. ఓ 41 నిమిషాల పాటు సాగే ఈ షార్ట్ ఫిల్మ్ మనుషులకు, ఏనుగులకు మధ్య ఏర్పడిన ఓ దృఢమైన బంధం గురించి, అడవి బిడ్డల బతుకుల గురించి మనసు హత్తుకునేలా, కళ్లు చెమర్చేలా చూపిస్తోంది.

తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ ప్రకృతి అందాలు కూడా సినిమాలో కనిపిస్తాయి. దీంతో పాటు ప్రకృతితో మమేకమైన గిరిజనుల జీవితాన్ని కూడా ఈ సినిమా చూపిస్తుంది. ఈ చిత్రం జంతువులు మరియు మనుషుల మధ్య బంధాన్ని చూపిస్తూ, హృదయాన్ని కదిలించే కథ మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. సిఖ్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2022న అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన డీఓసీ ఎన్ వైసీ ఫిల్మ్ ఫెస్టివల్ లో వరల్డ్ ప్రీమియర్ ను ప్రదర్శించింది.