ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురువరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే.

ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో నేడు విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని కవిత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.