కరోనా ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు

కరోనా ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : హాంకాంగ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలో స్వయం ప్రతిపత్తికల్గిన ఈ ప్రాంతానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. కరోనా ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దుఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అధికారులు కరోనా ఆంక్షలు విధించారు. దీంతో పాటు డిమాండ్ కూడా తక్కువగా ఉన్నదని ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.