ప్లీనరీ ఏర్పాట్లపై నేతలతో కేటీఆర్ సమావేశం 

ప్లీనరీ ఏర్పాట్లపై నేతలతో కేటీఆర్ సమావేశం

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా ప్లీనరీ ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. హెచ్ఐసీసీలో జరిగిన సమావేశంలో ప్లీనరీ ఏర్పాట్లపై కేటీఆర్ చర్చించారు. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ప్లీనరీ కోసం కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ ఆహ్వానాలు పంపామని తెలిపారు. మాజీ మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు కేటీఆర్ చెప్పారు.ప్లీనరీ ఏర్పాట్లపై నేతలతో కేటీఆర్ సమావేశం ప్లీనరీ రోజున ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల వివరాలు నమోదు కార్యక్రమం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు వివిధ అంశాలపై తీర్మానాలు, చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రతినిధుల సభకు ఆహ్వానిదులు మాత్రమే రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని కేటీఆర్ కోరారు.