హనుమకొండ జిల్లా : దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంఖుస్థాపన మరియు పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాలను నిర్వహణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా పండుగను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని పల్లెపల్లెనా, వాడవాడనా టీఆర్ఎస్ శ్రేణులు జెండాలను ఎగురవేసి, సంబురాలు నిర్వహించాయి. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
ఇందులో భాగంగా టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశానుసారం హనుమకొండ జిల్లాలోని ప్రతీ గల్లీలో గులాబీ జెండా పండుగను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ లోని మండల ఆఫీస్ సర్కిల్ వద్ద, మండల ఆఫీస్ ఎదురుగా, పింగళి కళాశాలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుందర్ రాజ్ యాదవ్ సమక్షంలో గులాబీ జెండాలను ఆవిష్కరించి, జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో తొలి ప్రాంతీయ పార్టీ కార్యాలయ నిర్మాణం చేస్తున్నండటం గర్వకారణమని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, రాష్ట్ర నాయకులు సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. దేశరాజకీయాల్లో ముఖ్య పాత్రను పోషించే పార్టీ టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. అత్యధికంగా 60 లక్షల మంది గులాబీ సైన్యాన్ని కల్గిన పార్టీ టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. క్రమశిక్షణగల కార్యకర్తలకు మారు పేరు టీఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలిపారు.
పార్టీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. 60వ డివిజన్ లో అందరి సమక్షంలో అందరి ఇష్టపూర్వకమైన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేషబోయిన శ్రవణ్-అరుణ, డివిజన్ అధ్యక్షులు రాంరాజ్ , కేఎస్బీ డైరెక్టర్ స్నేహాలత, పార్టీ ముఖ్య నాయకులు మట్టపల్లి రమేష్, సంపత్ రెడ్డి, కొటేశ్వర్, సమ్మయ్య, నవీన్, సతీష్, ఉదిత్, గణేష్, అశోక్, యాదగిరి, సాగర్, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, అనిల్, శ్రీకాంత్, యూత్ నాయకులు విపుల్, నరేష్, వంశీ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.