ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్ చేయండి

ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్ చేయండి

ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్ చేయండివరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నవంబర్ 28 న వరంగల్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించే కేఎంసి గ్రౌండును ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. వరంగల్ లోని కేఎంసి ప్రాంగణంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్ననున్నారని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు.

లక్షమంది గులాబీ శ్రేణులతో పాటు అనేక సంక్షేమ పథకాలు పొందినటువంటి లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. 93 లక్షలకు పై చిలుకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి సన్న బియ్యం, అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకునేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలను రూపొందించిందనన్నారు. ఇప్పటికే మా గెలుపు ఖాయం అయిందని, మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రజలు కేసీఆర్ కు నా గెలుపును బహుమతిగా అందించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అన్నారు.

ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసిన ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వరంగల్ తూర్పు,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి లక్షమంది ఈ సభకు రాబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, నాయకులు కోరబోయిన సాంబయ్య, జనార్దన్ పటేల్, రోహిత్ సింగ్ ఠాగూర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.