టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన
– పాల్గొన్న సుమారు 600 మంది స్కూల్ విద్యార్థులు
– విద్యార్థుల్లో స్కిల్స్ ను పెంపొందించడమే ఈ ట్రస్ట్ లక్ష్యం
– ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.దాస్యం అభినవ్ భాస్కర్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : విద్యార్థుల్లోని విద్యా నైపుణ్యతను పెంపొందించడమే సర్వోదయ మిత్రమండలి ప్రధాన ధ్యేయమని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, జీడబ్ల్యూఎంసీ 60వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ తెలిపారు. సర్వోదయ మిత్ర మండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని మర్కజి, శాయంపేట, వడ్డేపల్లి, సోమిడి ప్రభుత్వ పాఠశాలల్లోని 9వ, 10వ తరగతి చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు జనరల్ నాలెడ్జ్ లో 100 మార్కులకు ఈ టాలెంట్ టెస్ట్ ను సోమవారం నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే ఈ టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ట్రస్ట్ వ్యవస్థాపకులు,కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ తెలిపారు. ప్రతీ యేడాది డిసెంబర్ లో ఈ పరీక్షను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణకు సహకరించిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహణలో తమకు సహకరించిన వదాన్య జన సొసైటీకి దాస్యం అభినవ్ భాస్కర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ పరీక్ష నిర్వహణలో పాఠశాల ఉపాధ్యాయులు, ట్రస్ట్ వాలంటీర్స్ మోడెం రాజేష్, పిన్నింటి విజయ్ కుమార్, మద్దెల కార్తిక్, శ్రీ సాయి, సాయి కుమార్, కార్తికేయ, అవినాష్, రియాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.