హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లోవెబ్ ఆప్షన్ల స్వీకరణ

హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లోవెబ్ ఆప్షన్ల స్వీకరణ

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అదనపు మాప్ అప్ విడత వెబ్ కౌన్సిలింగ్ కు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వర్గాలు నేడు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 2న ఉదయం 8 గంటల నుంచి 4న మధ్యాహ్నం 2 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా వెబ్ ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించించారు. కాలేజీల వారిగా మిగిలిపోయిన సీట్ల వివరాలను వెబ్ సైట్ లో చూసుకోవచ్చన్నారు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.