సీయూఈటీ-2022 నోటిఫికేషన్ విడుదల  

సీయూఈటీ-2022 నోటిఫికేషన్ విడుదల

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ( సీయూఈటీ ) 2022 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరించనున్నారు. ఈ ఏప్రిల్ 6, నుంచి మే 6 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.సీయూఈటీ-2022 నోటిఫికేషన్ విడుదల  జనరల్/ అన్ రిజర్వ్ డ్ కేటగిరీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ. 650, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ -నాన్ క్రిమిలేయర్ కు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ కు రూ. 550 ఫీజుగా నిర్ణయించారు. జూలై 2022 మొదటి లేదా రెండో వారంలో సీయూఈటీ 2022 ప్రవేశ పరీక్షఉంటుందని ఎన్టీఏ నోటిఫికేషన్ లో తెలిపింది. మొత్తం 13 భాషట్లో పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.