యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2022 విడుదల 

యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2022 విడుదల

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2021 డిసెంబర్, 2022 జూన్ రెండింటికి గానూ ఒకే నోటిఫికేషన్ ను జారీ చేసిన ఎన్టీఏ, ఇందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 30 నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా, మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెల్పింది. మొత్తంగా 82 సబ్జెక్టులకు గాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్ కు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్ లోడింగ్ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు.యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2022 విడుదల ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. దీంట్లో స్కోర్ సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టింట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు http://http://ugcnet.nta.ac.inవెబ్ సైట్ ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.