ఈ నెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్!

ఈ నెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్!

ఈ నెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : ఫిబ్రవరి 14న సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటన ఖరారైంది. యాదాద్రి ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కూడా కొండగట్టుకి రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జేఎన్టీయూ కాలేజీలో హెలిప్యాడ్ మిగతా భద్రతా ఏర్పాట్లను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ పరిశీలించారు. రెండ్రోజుల క్రితమే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి కేసీఆర్ నిధులు కేటాయించడం జరిగింది. దీంతో దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధులను మంజూరు చేస్తూ, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో కలిసి కేసీఆర్ పరిశీలించనున్నారు.

ఈ కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో ఆలయ అభివృద్ధి కి రూ.100 కోట్లు విడుదల చేయనున్నట్లు గత యేడాది డిసెంబర్ నెలలో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ఇటీవల నిధుల విడుదల చేశారు. ఇప్పుడు పునర్నిర్మాణ పనులను పరిశీలించడానికి సీఎం కేసీఆరే స్వయంగా ఆలయ సందర్శనకు రావడం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యేళ్ల తరబడిగా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న టైం వచ్చినట్లు అయింది. మరోవైపు యాదగిరిగుట్టకు ప్లాన్ ఇచ్చిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.