హైదరాబాద్ లో ముగిసిన ఫార్ములా-ఈ రేస్

హైదరాబాద్ లో ముగిసిన ఫార్ములా-ఈ రేస్

హైదరాబాద్ లో ముగిసిన ఫార్ములా-ఈ రేస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్ములా-ఈ రేస్ పోటీలు ముగిశాయి. ఈ-రేస్ వరల్డ్ చాంపియన్ షిప్ విజేతగా జీన్ ఎరిన్ వెర్డ్ నే నిలిచారు. విజేతకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీని అందించి అభినందించారు. 2,3 స్థానాల్లో నిక్ క్యాసిడీ, సెబాస్టియన్ నిలిచారు.మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. గంటకు 322 కిలో మీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్ గా అంతరించాడు.హైదరాబాద్ లో ముగిసిన ఫార్ములా-ఈ రేస్2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్ లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు హైదరాబాద్ నగరం వేదికైంది. దీనికి తోడు మొత్తంగా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హైదరాబాద్ వేదికగా మొదటిసారి రేసింగ్ పోటీలు జరిగాయి. హుస్సేన్ సాగర్ తీరప్రాంతంలో 2.8 కిలో మీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్ పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్ 3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. ఈ రేసింగ్ లో ప్రపంచస్థాయి రేసర్లు పాల్గొని అదరగొట్టారు. రేసింగ్ లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, ఇండియా నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది.

ఈ రేసుని వీక్షించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా తరలివచ్చారు. కొన్ని వందల మంది ప్రేక్షకులు గ్యాలరీల్లో కూర్చుని ఈ పోటీని ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ మార్గ్ లో ఈ రేసు కోసం ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ స్ట్రీ సర్క్యూట్’ పై రేసర్లు రాకెట్ వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. ఫార్ములా-ఈ రేసుని తిలకించేందుకు టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, నాగచైతన్య, అఖిల్, దుల్కర్ సల్మాన్, శృతి హాసన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు.. నారాలోకేష్ సతీమణి బ్రాహ్మణి, తదితరులు హాజరయ్యారు. భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్ తదితరులు హాజరయ్యారు. అలానే ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ కూడా వచ్చారు.