ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు ? 

ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు ?

ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు ? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది. ముందస్తు ఉంటుందా? అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన విధానం, మోడీ పాలనను ఎండగట్టిన తీరు.. అదే సమయంలో మన్మోహన్ సింగ్ పాలనపై ప్రశంసలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పిన విధానం, రాష్ట్రంలోని అన్ని వర్గాలను స్పృశిస్తూ ఆయన ప్రసంగించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

*కేసీఆర్ ప్రసంగం ముందస్తుకు సంకేతమా ?
కేసీఆర్ ప్రసంగాన్నిసునిశితంగా పరిశీలిస్తే ముందస్తు దిశగా సంకేతాలిచ్చారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఆదిశగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరేమో ప్రతిపక్షాలను డైవర్ట్ చేయడానికే కేసీఆర్ ఇలా సంకేతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ తెలంగాణపై సీరియస్ గా దృష్టి పెట్టిన విధానం, రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ అంశాలను సీఎం కేసీఆర్ బేరీజు వేసుకున్నారట. ప్రతిపక్షాలకు సమయం ఇస్తే ప్రజల అభిప్రాయం మారిపోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లేందుకే ఆలోచిస్తున్నారని టాక్.ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు ? *కేసీఆర్ పాలనపై పాజిటివ్ గా పబ్లిక్..
రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంది. బీఆర్ఎస్ కొంచెం ఎక్కువ దూకుడు మీద ఉంది. కేసీఆర్ పాలన బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారింది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అయితే లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ పాలనపై ప్రజల్లో పాజిటివ్ ఒపినియన్ ఉందని టాక్. కేసీఆర్ చేపట్టిన పథకాలే ఆయనకు కొండంత ధీమానిస్తున్నాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా ముందస్తుకు వెళ్లి, సానుకూల ఫలితాలు రాబట్టే దిశగా సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

*దూకుడు పెంచిన బీజేపీ..
రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేనంత వేగంగా బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఘంటాపథంగా చెబుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ 30 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే పార్టీ బీజేపీయేనన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైందనే చెప్పాలి. లేకపోతే రాష్ట్రంలో గట్టి ఓటు బ్యాంకున్న కాంగ్రెస్ ను దాటి, బీజేపీ రేసులోకి రావడమంటే మాటలు కాదు. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి లాంటి వారు ప్రతీ రోజూ కేసీఆర్ సర్కారుతో ఢీ అంటే ఢీ అనడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు బీజేపీ శ్రేణులు.

*ఆయనకు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తారా!
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ కు గట్టి పోటీనివ్వగల బలమైన నాయకుడు ఉన్నాడు. రేవంత్ కు తగ్గ రీతిలో భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, జానా, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్ బాబు లాంటి హేమాహేమీలు ఉన్నారు. కానీ ఈ సీనియర్లంతా రేవంత్ కు ఎంత వరకు సపోర్ట్ చేస్తారో తెలియదు. పాదయాత్రతో రేవంత్ రెడ్డి వేగం పెంచినప్పటికి దానికి బ్రేకులు వేయడానికి ఎవరో అవసరం లేదు. సొంతపార్టీ నేతలే ఆయనకు బ్రేకులు వేసే ప్రమాదముందని టాక్.

ఎందుకంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే, సీనియర్లు ఎవరూ అటు వైపు ఇంకా కన్నెత్తి కూడా చూడలేదు. పీసీసీ చీఫ్ పాదయాత్ర చేస్తుంటే, ఈ పరిస్థితి ఎందుకుందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. అధికారంలోకి రావాలని ఆశిస్తున్న పార్టీలో ఈ స్థాయిలో అంతర్గత రాజకీయాలు జరగడం క్యాడర్ ను కూడా అయోమయానికి గురిచేస్తోంది. కాబట్టి కాంగ్రెస్ నేతల పరిస్థితి చూస్తుంటే కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు ? 

* కొత్త పథకాలు..బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్!
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కేసీఆర్ కు అడ్వాంటేజ్ అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో గడ్డు పరిస్థితులున్నప్పటికీ వాటి నుంచి గట్టెక్కించగలిగే ప్లానింగ్ కేసీఆర్ దగ్గర ఉందనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ త్వరలోనే తన అమ్ములపొది నుంచి రెండు, మూడు సంక్షేమ పథకాలను ప్రకటించవచ్చని టాక్. ఆ పథకాలకు ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. ఆ దిశగా కేసీఆర్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారని టాక్. అదే జరిగితే బీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని గులాబీ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లు రెండోస్థానానికి పోటీ పడాల్సి ఉంటుందన్న అంచనాలున్నాయి. చూడాలి మరి. కేసీఆర్ ప్రకటించే ఆ పథకాలే ఏ రేంజ్ లో ఉంటాయో? ఆ పథకాలేంటి అన్నదానిపై పలురకాల చర్చలైతే జరుగుతున్నాయి. కానీ అవేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

*ప్రతిపక్షాలను డైవర్ట్ చేయడానికేనా ఈ ముందస్తు మాట!
మొత్తానికి కేసీఆర్ అడుగులు వేగం అందుకున్నా కచ్చితంగా ఆయన ఇది చేస్తారన్నది అంచనా వేయలేం. కేసీఆర్ ను అంచనా వేయడం చాలా కష్టం. అంచనాలకు అందని ప్లానింగ్ కేసీఆర్ ది. కాబట్టి ముందస్తు దిశగా సంకేతాలిచ్చి, ప్రతిపక్షాలను డైవర్ట్ చేయాలన్న ప్లానింగ్ కూడా దీని వెనక ఉండొచ్చు. కేసీఆర్ ప్లానింగ్ ఏదైనా ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ పాసయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. కానీ ఏదేమైనా ముందస్తు ఉంటుందా? లేదా? అన్నది మాత్రం స్పష్టంగా అయితే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.