కేయూ అధ్యాపకురాలు డా.కందాల శోభ మృతి!

కేయూ అధ్యాపకురాలు డా.కందాల శోభ మృతి!

కేయూ అధ్యాపకురాలు డా.కందాల శోభ మృతి!

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్ కందాల శోభ ఆదివారం సాయంత్రం ఎంజీఎం హాస్పిటల్ లో మృతి చెందారు.డాక్టర్ శోభారాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్ శోభారాణి మృదు స్వభావి గల వ్యక్తి. గొప్ప సాహితివేత్త, రచయిత, కవి విమర్శకురాలు, అంతకుమించి మంచి అధ్యాపకురాలు. ప్రతీ వ్యక్తితో స్నేహభావం కలిగి ఉండేవారు.

ఎంతటి సంకటిత కార్యక్రమాన్ని అయినా ధైర్యంతో ఎదుర్కోవాలని పదేపదే అనేవారు. అటువంటి వ్యక్తి భౌతికంగా దూరంకావడం బాధాకరమని కేయూ అధికారులు, అధ్యాపకులు, బోధనేతన సిబ్బంది, అరసంతో పాటు పలు సంఘాల నాయకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సమాజం సామాజిక వ్యవస్థ, వ్యవహారాలు గూర్చి చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శోభారాణి మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.