కేసీఆర్ ను కలిసిన చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు

కేసీఆర్ ను కలిసిన చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు కృతజ్ఞతగా ఆమె కుటుంబ సభ్యులు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ని కలిశారు. సీఎంకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.కేసీఆర్ ను కలిసిన చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులుసీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఐలమ్మ కుటుంబ సభ్యులు ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ వారితో మాట్లాడారు. ఐలమ్మ చరిత్రను కూడా రికార్డు చేయాలని, వారికి, వారి కుటుంబానికి సంబంధించిన వివరాలు మరిన్ని కావాలని చెప్పారు. తెలంగాణ వచ్చాకే ఐలమ్మ కు తగిన గుర్తింపు, గౌరవాలు దక్కాయని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి ఋణపడి ఉంటామని ఐలమ్మ కుటుంబ సభ్యులు అన్నారు. తమను సీఎం కేసీఆర్ దగ్గరకి చొరవతో తీసుకెళ్ళి కల్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి వారు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంని కలిసిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులతో పాటు ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం,వారి కొడుకు చిట్యాల సంపత్ – చిట్యాల శ్వేత మనుమడు, మనుమరాళ్ళు ఉన్నారు.