మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహం ధ్వంసంవరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా :పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో అర్థరాత్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గత నెల 16న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించింది.
వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3800 మైలురాయి చేరుకున్న సందర్భంగా అవుతాపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. గత నెల 16న ఉద్రిక్త పరిస్థితి నడుమ వైఎస్ఆర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అంతలోనే ఇలా జరుగడంతో దుండగులు ఎవరనేది దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.