బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూ

బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూ

-రూ. 300 కోట్లతో త్రీ ఫేజ్ కరెంట్
– ఆలోచించి ఓట్లు వేయాలని సూచన
-శంకర్ నాయక్ గెలుపు డిక్లేర్ చేసిన సీఎం కేసీఆర్
-మానుకోట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్బీఆర్ఎస్ సర్కార్ ఉంటే ప్రగతి కంటిన్యూవరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణలో అభివృద్ధి కంటిన్యూగా ఉంటుందని, ప్రజలకు లాభం జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.తెలంగాణలోని ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసి గూడెలకు, ప్రతి లంబాడీ తండాకు, వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. రూ. 300 కోట్లతో పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు.ఇక 50 యేళ్ల కాంగ్రెస్ రాజ్యం ఎలా ఉండే, ఈ పదేండ్ల నుంచి ప్రజారాజ్యం ఎలా నడుస్తుందని ఆలోచించి, ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాయకత్వంలో 20 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. పోడు భూముల సందర్భంగా జరిగిన ఆందోళన కేసులను రద్దు చేసినట్లు గుర్తు చేశారు, పోడు పట్టాలతో పాటు రైతు బంధు కూడా ఇచ్చాం, రైతు బీమా చేయించామన్నారు.గిరిజన ఆవాసాల్లో త్రీ ఫేజ్ కరెంట్ లేని చోటకు విద్యుత్ లైన్లు వేయించామన్నారు. ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసి గూడెలకు, ప్రతీ లంబాడి తండాకు, వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.

గిరిజన బిడ్డల కోసం గురుకులాలు స్థాపించామని కేసీఆర్ గుర్తు చేశారు. మహబూబాబాద్ కు ఇంజినీరింగ్ కాలేజీ కూడా వచ్చింది. భవిష్యత్ లో మరిన్ని విద్యాసంస్థలు వస్తాయి. మహబూబాబాబ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ఖచ్ఛితంగా గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 60 యేళ్లు ఏడిపించింది. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు. ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని మానుకోట ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.సభకు వచ్చిన ప్రజలను చూసి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బహిరంగ సభకు హాజరైన మానుకోట ప్రజలను చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపును డిక్లేర్ చేశారు కేసీఆర్. ప్రజల ఆశీర్వాదం , ఉత్సాహం చూస్తుంటే శంకర్ నాయక్ ను గెలిపించుకుంటారన్న నమ్మకం బలంగా ఉందని , ఆయన గెలుపు ఖాయమైందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.