కేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : దాస్యం

కేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : దాస్యంకేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 49,50వ డివిజన్లలోని జులైవాడ జంక్షన్,జులైవాడ, పోస్టల్ కాలనీ, నాగేంద్ర నగర్ లలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రచారం నిర్వహించారు.ప్రచార కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు బ్రహ్మరథం పట్టారు. వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు.కేసీఆర్ పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకెంతగానో ఉపయోగపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.కేసీఆర్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : దాస్యంప్రచారంలో భాగంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. హనుమకొండలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టామని అన్నారు. ఐదువేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశానని,ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన మేనిఫెస్టో (కేసీఆర్ భరోసా)ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కార్యకర్తలకు సూచించారు.గతంలో కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలే కాకుండా మేనిఫెస్టోలో లేనటువంటి పథకాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి వాటిని సంపూర్ణంగా అందించినటువంటి ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని దాస్యం అన్నారు.దేశ ప్రజలు కూడా కేసీఆర్ నే కోరుకుంటున్నారని తెలిపారు.అన్ని రంగాలలో కేసీఆర్ ను,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తూ,పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 సీట్లతో గెలిపించనున్నారని అన్నారు. ప్రతి ఇంటికి గడపగడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు అందుబాటులో లేని నాయకులు ఎన్నికల అప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ,ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని,ప్రజలు వారి మాటలు నమ్మొద్దని ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఉందా అని ప్రశ్నించారు.వారు పాలించే రాష్ట్రాలలో అభివృద్ధి ఉంటే రైతులు రోడ్లమీదకి వచ్చి ఎందుకు ధర్నా చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,కార్పొరేటర్లు నెక్కొండ కవిత కిషన్,ఏనుగుల మానస రాంప్రసాద్,డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,విద్యార్థి విభాగం నాయకులు,యూత్ విభాగం నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.