లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉమెన్స్ డే వేడుకలు

లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉమెన్స్ డే వేడుకలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కార్యదర్శి జి.వి.మహేష్ నాథ్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవ అధికార సంస్థ వరంగల్ చైర్మన్ నందికొండ నర్సింగ్ రావు, ఆయన సతీమణి నీరజ హాజరయ్యారు. సమాజంలో స్త్రీ చైతన్యం కోసం, పురుషులతో సమానంగా స్త్రీకి అవకాశం కల్గినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నందికొండ నర్సింగ్ రావు తెలిపారు. మహిళా సాధికారికత లేకుండా మానవజాతి అభివృద్ధి సాధించలేదు. ఇంట్లో ఒక స్త్రీ విద్యావంతురాలైతే తన కుటుంబంతో పాటు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుందన్నారు. ఒక ఇంట్లో భార్య భర్త స్థానాన్ని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది కానీ, ఒక భర్త భార్య స్థానాన్ని మాత్రం పూర్తిగా నిర్వహించగలగలేడు అని తెలిపారు.లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉమెన్స్ డే వేడుకలునేటి సమాజంలో మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు, ఉద్యోగ బాధ్యత, సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతగా వ్యవహరించి వివిధ కోణాలలో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరిచి నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని ఇది చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చును. ఈ సందర్భంగా కోర్టు మహిళా సిబ్బందికి మరియు ఇతర శాఖల ఉద్యోగినిలకు సాంస్కృతిక, క్రీడా, వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. వీటిలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను నిరూపించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మహిళా న్యాయమూర్తులచే కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు.లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉమెన్స్ డే వేడుకలుఈ కార్యక్రమంలో మహిళా న్యాయమూర్తులు కే.శైలజ, పి.ముక్తిద, సి. పావని, రాధాదేవి, వై.సత్యేంద్ర చైర్మన్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ మరియు ఇతర న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.వి. మహేష్ నాథ్, వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కే. పి ఈశ్వర్ నాథ్, వరంగల్ కోర్టు మహిళా సిబ్బంది, వివిధ శాఖల మహిళా ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు, మహిళా న్యాయమూర్తులను, న్యాయ శాఖ మహిళా ఉద్యోగినులు శాలువాలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.