మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి : కలెక్టర్ 

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి : కలెక్టర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హనుమకొండా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆర్థిక చేయూత పథకాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.

సమాజంలో లింగ సమానత్వం దిశగా అందరూ సహకరించాలని, తల్లిదండ్రులు పిల్లల చిన్నతనం నుండి మహిళలను గౌరవించే విధంగా పెంచాలని తెలిపారు. ఉద్యోగుల కోరిక మేరకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయని అందులో ఉద్యోగులు అందరూ చాలా ఉత్సహంతో పాల్గొన్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి : కలెక్టర్ మహిళా ఉద్యోగులకు ఆరోగ్యానికి సంబంధించి వైద్య సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు సాదించాలనుకుంటే వారికి ఏది అడ్డు కాదని అన్నారు.ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. వుమెన్స్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడా సాంస్కృతిక ఉత్సవంలో గెలుపుందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యోగులు కలెక్టర్, అదనపు కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. వుమెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ లో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి : కలెక్టర్ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిసిపి కె. వెంకట లక్ష్మీ, ఆర్డిఓ వాసు చంద్ర, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, జిల్లా మహిళా అధికారులు మాధవి లత, క్రిష్ణ వేణి, నీరజ, విజయ లక్ష్మి, రామ దేవి, మహిళా ఉద్యోగులు. టిజిఓ ఎ. జగన్ మోహన్ రావు, మురళీధర్ రెడ్డి, త్రెస్సా, రాజ్ కుమార్, డా. ప్రవీణ్, టీఎన్జీవో, నాయకులు నాల్గవ తరగతి ఉద్యోగుల నాయకుడు దాస్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.