జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన సీఎం కేసీఆర్

జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు ఆకాశాన్నంటుతున్నాయి. కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు నేటి నుంచే వెలువడుతాయని సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. ఇక నుంచి ప్రతీ యేడాది జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు. తద్వారా నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాల భర్తీ చేపడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన సీఎం కేసీఆర్తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియచేయానికి సంతోషిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ యేడాది ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్ధులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.