కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సీతక్క

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సీతక్కములుగు జిల్లా : గంగారాం మండల తహశీల్దార్ కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. ప్రభుత్వం అందించే ప్రతీ ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. లబ్ధిదారులు డబ్బులు వృధా చెయ్యకుండా అభివృద్ది పనులు చేసుకోవాలని లబ్ధిదారులను సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో , జెడ్పీటీసీ లు ఈసం రమ సురేష్, పుల్సామ్ పుష్పలత శ్రీనివాస్, ఎంపీపీలు సువర్ణ పాక సరోజన, విజయ రూపు సింగ్, మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, వజ్జ సారయ్య, వైస్ ఎంపీపీ ముడిగె వీరభద్ర, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, సర్పంచులు మద్దెల సాంబయ్య, వెంకట లక్ష్మీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పేనుక పురుషోత్తం, రాదరపు కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.