ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

ఢిల్లీ : ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలో 390 కోట్ల రూపాయలతో ఈ.ఎస్.ఐ ఆసుపత్రి మంజూరు చేసినట్లు బీజేపి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు . అధునాతన వసతులతో 400 పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని ప్రకటన చేశారు. అతి త్వరలోనే నిర్మాణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎంపీ జివిఎల్ నరసింహరావు వెల్లడించారు.