పశ్చిమలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి : పద్మ

పశ్చిమలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి : పద్మ

పశ్చిమలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి : పద్మ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే బీజేపీకి పట్టం కట్టాలని బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రావు పద్మ బీజేపీ నాయకులతో కలిసి కాజీపేట చౌరస్తా నుండి అదాలత్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని పలు వ్యాపార షాప్స్ లలో, దుకాణాల యజమానులను కలుస్తూ ఈ సారి బీజేపీకి ఒక అవకాశం కల్పించాలని కోరారు.బీజేపీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెల్పించాలని ప్రజలను కోరారు.ఈ పాదయాత్రలో బీజేపీ గోవా ఎమ్మెల్యే సంకల్ప్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి డా.వి.మురళీధర్ గౌడ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు