నాకు 60వేల ఓట్ల మెజారిటీ ఖాయం : ఎర్రబెల్లి

నాకు 60వేల ఓట్ల మెజారిటీ ఖాయం : ఎర్రబెల్లి

నాకు 60వేల ఓట్ల మెజారిటీ ఖాయం : ఎర్రబెల్లివరంగల్ టైమ్స్,మహబూబాబాద్ జిల్లా : వలస పక్షులు ఎప్పుడైనా, ఎక్కడైనా కొన్ని రోజులే ఉంటాయని, మళ్లీ తిరిగి అవి వాటి సొంత గూటికే చేరుకుంటాయని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దూసుకుపోతున్నారు. తాజాగా సోమవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని సోమవారం, జమస్థాన్ పురం, మేడిపల్లి గ్రామాల్లో అశేష ప్రజానీకం మధ్య అంగరంగ వైభవంగా ప్రచారం కొనసాగింది. ప్రజలతో మమేకమై, డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటాలు, బతుకమ్మలతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికింది.

వాడవాడలా తిరుగుతూ కనిపించిన వృద్ధులను, పిల్లలను, మహిళలను పలకరిస్తూ దయాకర్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. మీ కుటుంబ కష్ట సుఃఖాల్లో, ఆపద సంపదలో, కరోనా లాంటి విపత్కర సమయంలోను మీకు అండగా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మీరు నా తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించండని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఆరుసార్లు ఏ అవినీతి మచ్చ లేకుండా గెలిచిన నాయకున్ని నేను, మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మంత్రి పదవిని కూడా నిర్వర్తించాను, మీ నియోజకవర్గ అభ్యర్థికి మంత్రి పదవి అంటే అది మీకు ఇచ్చిన గౌరవమే. అలాంటిది మళ్ళీ నన్ను గెలిపించి, భారీ మెజారిటీ ఇవ్వాలని అభ్యర్థించారు.

పాలకుర్తి నియోజకవర్గానికి గత ఐదేళ్లలో త్రాగు, సాగునీరు, మన చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధి, దళిత బంధు, రైతుబంధు, ఆసరా పింఛన్లు, గ్రామ గ్రామాన సిసి రోడ్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ లాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేశారని, అదే 60 యేళ్ళు పాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయితే కరెంటు సరిగా ఉండేది కాదు, నాణ్యమైన రోడ్లు లేవు, కనీసం తాగడానికి మంచినీటి కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. బీఆర్ఎస్ వచ్చిన 9 యేళ్లలోనే 24 గంటలు కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, పంట పొలాలకు సరిపడా నీళ్ల అందించే అనేక చెక్ డ్యామ్ లు, భారీ నీటి ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చేశామని ఆయన అన్నారు.40 యేళ్ల నా రాజకీయ జీవితాన్ని ప్రజలకే అంకితం చేశాను.

నా కుటుంబ సభ్యుల కంటే మీ మధ్యనే ఎక్కువ కాలం గడిపానని, తన మనమల్లు, మనుమరాలు ఇప్పటికీ వాళ్ళతో సరదాగా గడిపే సమయమే ఇవ్వట్లేదని అంటారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండల గ్రామాల్లోని ప్రజలు తనను మంత్రి, ఎమ్మెల్యేల గా కంటే దయన్నగానే తనను ఆప్యాయంగా పిలుచుకుంటారని అలాంటి చనువు మరెవరికి దక్కదని ఆయన తలచుకున్నారు. కాగా ఇప్పుడు తనపై పోటీ చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని వలస పక్షుల లాంటివారని , నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ తెలియదని ఆమె గురించి వాళ్ళ నాన్న, వాళ్ళ అత్తమామలు ఎలాంటి వారో మనకు ఎవరికీ తెలియదని మధ్యలో బ్రోకర్ లాంటి వారిని పెట్టి అబద్ధపు మాటలు ప్రచార చేయిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. మీరు స్వయంగా 40 యేళ్ల నుంచి నన్ను చూస్తున్నారని ఓటు మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఎవరికి ఓటు వేయాలో మీరే తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, ఓటును సరైన దిశగా వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల,గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.