కేసీఆర్​ నేతృత్వంలోనే ఆలయాల పునరుద్ధరణ: ఎర్రబెల్లి

కేసీఆర్​ నేతృత్వంలోనే ఆలయాల పునరుద్ధరణ: ఎర్రబెల్లి

యాదగిరి గుట్ట : సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాల పునరుద్ధరణ జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మంగళవారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ ఈవో, అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రి కి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. దేవాలయ ప్రాంగణంలో శిల్ప కళా నైపుణ్యాలను స్వయంగా పరిశీలించిన ఎర్రబెల్లి మాట్లాడారు. తిరుమల తరహాలోనే యాదగిరి గుట్టను రూ. 13 వందల కోట్ల తో సీఎం కేసీఆర్ అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అలాగే, వేములవాడ, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి, పాలకుర్తి, వల్మిడి వంటి అనేక దేవాలయాలకు సీఎం పూర్వ వైభవం తెచ్చినట్లు పేర్కొన్నారు. దేవాలయాల అర్చకులకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు అందిస్తున్నట్లు వివరించారు. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి తమకు ఇలవేల్పు అని తరచూ ఇక్కడకు వస్తుంటానని చెప్పారు. మంత్రి వెంట ఆలయ అధికారులు, పూజారులు ఉన్నారు.