కొత్తగా 1.68 లక్షల కరోనా కేసులు

కొత్తగా 1.68 లక్షల కరోనా కేసులున్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభన వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా 1,68,063 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 277 మంది ఈ వైరస్ కు బలైనట్లు తెలిపారు.

నిన్నటితో పోల్చితే నేడు ఈ కేసుల సంఖ్య కొంతమేరకు తగ్గుముఖం పట్టిందన్నారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.79 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక భాగం మహారాష్ట్రలోనే వెలుగు చేశాయి. తాజాగా నమోదైన కేసులతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446 కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి చేరుకుంది. 69,959 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.