ఆ దేశంలో కలవరపెడుతున్న కొవిడ్

ఆ దేశంలో కలవరపెడుతున్న కొవిడ్

వరంగల్ టైమ్స్, చైనా : చైనాలో కొవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన ‘హెనాన్’లో దాదాపు 89% మంది ప్రజలు కొవిడ్ బారినపడినట్లు హెల్త్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ జనవరి 6 నాటికి కరోనా ఇన్ఫెక్షన్ రేటు 89 శాతానికి చేరినట్లు వెల్లడించారు. హెనాన్లో 9.94 కోట్ల మంది ఉంటే.. అందులో సుమారు 8.85 కోట్ల మంది వైరస్ బారినపడ్డారని అధికారులు తెలిపారు.