టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్

టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్హైదరాబాద్ : తెలంగాణ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఎర్రోళ్ల శ్రీనివాస్. సీఎం కేసీఆర్ కోరుకున్న విధంగా ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్.

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తానన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సన్మానించి, అభినందనలు తెలిపారు.

గతంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా అద్భుతంగా పనిచేసి ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఆరోగ్య తెలంగాణగా తెలంగాణ రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉందని హరీష్ రావు అన్నారు. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నడుపుతూ, వందకు వంద శాతం తన బాధ్యతలను నిర్వర్తించి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.