భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టిన పోలీసులు

భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టిన పోలీసులువరంగల్ టైమ్స్,అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు, సరిహద్దు రాష్ట్రాల సహకారంతో భారీగా గంజాయి స్వాధీనం చేశారు. ఏఓబీ (AOB)తో పాటు గిరిజన గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్కుపాదం మోపి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అలాగే గంజాయి సాగు చేయకుండా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో గంజాయిని మరికాసేపటిలో దహనం చేయనున్న ఏపీ పోలీస్ శాఖ